ధైర్యంగా ఉండండి... ప్రభుత్వ తరఫున ఆదుకుంటాం...

24-09-2026 | 06:54pm
  1. బాధిత కుటుంబానికి ఐదు లక్షల చెక్ అందజేత...
  2. బాధిత కుటుంబానికి ఇంద్రమ్మ ఇల్లు మంజూరు...
  3. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్...

ఉట్నూర్, సెప్టెంబర్ 24 ( విజయక్రాంతి ):  జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో  మృతి చెందిన బాధిత కుటుంబాలకు  ప్రభుత్వం (Government) అండగా ఉంటుందని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్(MLA Vedma Bojju Patel) అన్నారు. గురువారం ఇంద్రవెల్లి మండలంలోని  గిన్నెర గ్రామానికి చెందిన  కుంర్రా షేకు బాయి, దినేష్ దంపతుల కుమార్తె అగ్ని ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించారు. ఆదివాసి గోల్డ్ సాంప్రదాయం ప్రకారంగా అగ్ని ప్రమాదంలో మృతి చెందిన  చిన్నారికి చాయ్ పోసి నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంజూరు చేసిన 5 లక్షల రూపాయల చెక్కును  బాధిత కుటుంబానికి అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బాధిత కుటుంబాలు ధైర్యంగా ఉండాలని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అండగా ఉంటుందని గుర్తు చేశారు. జిల్లా కేంద్రంలో ని రిమ్స్ లో జరిగిన  సంఘటనపై  సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి చందడంతోపాటు  వెంటనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని  రిమ్స్ కు పంపించారని అన్నారు. రిమ్స్ ఆసుపత్రిలో  అగ్ని ప్రమాదంలో  మరణించిన చిన్నారుల కుటుంబాలను ఆదుకోవడంతోపాటు  మిగతా వారిని హైదరాబాద్ కు తరలించి  మెరుగైన వైద్యం అందిస్తున్నారని గుర్తు చేశారు.

గిన్నెరా  గ్రామానికి చెందిన  కుంర్రా షేకు బాయి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం అందజేసిన  5 లక్షల రూపాయలను  పెద్ద కూతురు పేరుతో  బ్యాంకులో డిపాజిట్ చేయాలని  సూచనలు చేశారు. ఆయనతోపాటు  తహసిల్దారులు  ప్రవీణ్ కుమార్,  రఘునాథరావు, ఎంపీడీవో మహేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ ముకడే ఉత్తం, సర్పంచ్ మెస్రం భీమ్ రావు, సార్ మేడి మెస్రం దుర్గు, కాంగ్రెస్ నాయకులు, మండలంలోని వివిధ గ్రామ పంచాయతీల సర్పంచులు  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు