నర్సింహ్మారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే యెన్నం

03-10-2026 | 06:47pm

మహబూబ్‌నగర్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ధర్మాపూర్ నర్సింహ్మారెడ్డి(Dharmapur Narsimha Reddy) మాతృమూర్తి కౌకుంట్ల పార్వతమ్మ అనారోగ్యంతో గురువారం సాయంత్రం మృతి చెందారు. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(MLA Yennam Srinivas Reddy) శనివారం ధర్మాపూర్‌(Dharmapur )లోని నర్సింహ్మారెడ్డి నివాసానికి వెళ్లి పార్వతమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు.

అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, పార్వతమ్మ మృతికి గల వివరాలను తెలుసుకున్నారు. తీవ్ర దుఃఖంలో ఉన్న నర్సింహ్మారెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.

కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సిరాజ్ ఖాద్రీ, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు రాజు గౌడ్, నాయకులు మైత్రి యాదయ్య, ప్రతాప్ రెడ్డి, 25వ డివిజన్ కార్పొరేటర్ పాండురంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు