కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షునిగా సతీష్ కుమార్
2002 నుంచి కంటిన్యూగా..
మునిపల్లి అక్టోబర్3 : ( విజయ్ క్రాంతి): మునిపల్లి మండల(Municipal Council) కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా మండలంలోని పిల్లోడి గ్రామానికి చెందిన సతీష్ కుమార్(Satish Kumar) ను నియమితులయ్యారు. ఈ సందర్భంగా 2008 నుంచి మండల అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. అయితే మండల నూతన కమిటీల్లో భాగంగా ఆశావాహుల్లో కొంత మంది సీనియర్ నాయకులకు అవకాశం వస్తుందని ఆశీంచినప్పటికీ మళ్లీ పాత వారికే అధ్యక్ష పదవిని కట్టబెట్టారు. పిల్లోడి సతీష్ కుమార్ పార్టీలో సీనియర్ నాయకుడు కావడంతో ఆయనకే మరో సారి పదవి రావడంపై కాంగ్రెస్ శ్రేణులు అభినందనలు తెలుపుతూ శుభాకాంక్షలు తెలిపారు.