ఖబర్దార్‌ కేసీఆర్‌, కేటీఆర్‌: తునికి రమేష్

08-09-2026 | 10:52pm

తాతా మధు వెంటనే రాజీనామా చేయాలి

బీఆర్‌ఎస్‌ పార్టీ అంటేనే బూతులు నేర్పే పార్టీ: వేణుగోపాల్ రెడ్డి 

శామీర్ పేట్,(విజయక్రాంతి): ఎమ్మెల్సీ తాత మధు వెంటనే రాజీనామా చేయాలని అలియాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్(Congress) నాయకులు విమర్శలు చేశారు. మంగళవారం అలియాబాద్ మున్సిపాలిటీ(Aliabad Municipality) కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా పలువురు నాయకులు మాట్లాడుతూ... ఎమ్మెల్సీ తాతా మధు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌, కేటీఆర్‌లు పదేళ్లు అధికారంలో ఉండి తెలంగాణ ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. గజ్వేల్‌ ప్రజలు సైతం కేసీఆర్‌ను రాజీనామా చేయాలని కోరుతున్నారని వ్యాఖ్యానించారు. మీరు ప్రజా నాయకులా.. లేక గుండాలా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

బీఆర్‌ఎస్‌ పార్టీ అంటేనే బూతులు నేర్పే పార్టీగా మారిందని వేణుగోపాల్‌ విమర్శించారు. తెలంగాణకు బూతులు నేర్పిందే కేసీఆర్‌ కుటుంబమని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ నేతల వ్యాఖ్యలు, ప్రవర్తనపై ప్రజలు తీవ్రంగా స్పందిస్తున్నారని నాయకులు తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపాలిటీ చైర్ పర్సన్ కంఠం శిరీష రెడ్డి, మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తునికి రమేష్, ఏ బ్లాక్ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి, మూడు చింతలపల్లి మున్సిపాలిటీ అధ్యక్షుడు వెంకటేష్, కంఠం కృష్ణారెడ్డి, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు