5 September, 2026 | 2:19 PM

విద్యుత్ హెచ్చు తగ్గులతో కాలిపోయిన మోటార్లు

05-09-2026 | 12:53pm

కాలనీ వాసులకు నీటి ఇబ్బంది

స్పందించి మరమ్మతులు చేయించిన కార్పొరేటర్

నస్పూర్, (విజయక్రాంతి): మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్(Mancherial Municipal Corporation) పరిధిలోని నస్పూర్(Naspur)లోని 33వ డివిజన్ లో విద్యుత్ హెచ్చుతగ్గుల కారణంగా ఒకే రోజు విద్యానగర్ వాసులకు తాగు నీరు అందించే మూడు బోర్ల కరెంట్ మోటార్లు చెడిపోయాయి. దీంతో కాలనీ వాసులకు మంచినీటికి, ఇతర అవసరాలకు ఇబ్బందులు పడ్డారు.

విషయం తెలుసుకున్న 33వ డివిజన్ కార్పొరేటర్(Division Corporator) ఎంబడి కుమారస్వామి వెంటనే స్పందించి, వెంటనే ఒకే రోజు మూడు కరెంట్ మోటార్లను మరమ్మతులు చేయించారు. కాలనీలో మంచినీటి సరఫరా పునరుద్ధరించబడటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. విద్యుత్ హెచ్చుతగ్గుల(Power fluctuations) కారణంగా మోటార్లు పదేపదే దెబ్బతింటున్న నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు సమస్యను పరిష్కరించాలని కోరారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వెంటనే స్పందించి మోటార్లను బాగు చేయించిన కార్పొరేటర్ కుమారస్వామికి కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు