గణేష్ మండపాలను సందర్శించిన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
20-09-2026 | 12:19pm
మణికొండ,సెప్టెంబర్ 20(విజయక్రాంతి): గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి(Konda Vishweshwar Reddy) మణికొండ, నేక్నాపూర్ డివిజన్లలోని పలు గణేష్ మండపాలను సందర్శించారు. ఈ సందర్భంగా గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని విఘ్నేశ్వర స్వామిని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే, బీజేపీ నాయకులు తోకల శ్రీనివాస్ రెడ్డి, మణికొండ డివిజన్ అధ్యక్షులు బి. రవికాంత్ రెడ్డి, విగ్నేష్ మహారాజ్, మాజీ కో-ఆప్షన్ సభ్యులు జొన్నాడ సిద్ధప్ప, రంగారెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యులు చిలుకూరి బీరప్ప, పా. కనాటి సత్యనారాయణ, సదాపాటిల్ రాము, రాజేష్, కిరణ్, గణేష్ తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.