భక్తి శ్రద్ధలతో వినాయక నిమజ్జనోత్సవం
* కాశీ వేద పండితులతో ప్రత్యేక పూజలు.. పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి
శివ్వంపేట, అక్టోబర్ 5 (విజయక్రాంతి): మండల కేంద్రం శివ్వంపేటలో ఆదివారం రాత్రి వినాయక నిమజ్జనోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు(Former MLA Mynampally Hanumantha Rao) కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కాశీక్షేత్రం నుంచి వచ్చిన వేద పండితులు మంత్రోచ్ఛారణల మధ్య పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం గణనాథుడిని నిమజ్జనానికి తరలించారు. ఈ సందర్భంగా శివశక్తి యూత్ అధ్యక్షుడు కొడకంచి శివప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, పలువురిని సన్మానించారు. కార్యక్రమంలో యువత, భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.