నాగలిగిద్ద జర్నలిస్ట్ ఫోరం నూతన కార్యవర్గం
09-09-2026 | 07:30pm
నాగల్ గిద్ద, సెప్టెంబర్ 9(విజయ క్రాంతి): నాగలిగిద్ద మండల జర్నలిస్ట్ ఫోరం నూతన కార్యవర్గాన్ని(New Executive Committee) ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షునిగా నాగశెట్టి (వార్త) పేపర్ విలేకరి, అధ్యక్షునిగా పుండ్లేక్ (ఆంధ్రజ్యోతి) విలేకరి, ఉపాధ్యక్షునిగా బాలాజీ (విజయక్రాంతి) విలేకరి, ప్రధాన కార్యదర్శిగా భీంసింగ్ రాథోడ్ (నమస్తే తెలంగాణ) విలేకరి, కార్యదర్శిగా మోహన్ (గాండీవం) విలేకరి, కోశాధికారిగా సిద్రాం పాటిల్ (నవతెలంగాణ) విలేకరి, సహాయ కార్యదర్శిగా గౌతం సిద్ధూ (సత్యవార్త) విలేకరి ఎన్నికయ్యారు.కార్యవర్గ సభ్యులుగా దత్తు సాయి (మన తెలంగాణ) విలేకరి, ప్రశాంత్ (జనంసాక్షి) విలేకరి, లక్ష్మణ్ (పెన్గన్) విలేకరి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా కృషి చేస్తామని తెలిపారు.