ఘనంగా ‘నమామి భారతం’ వందేమాతరం సామూహిక గానం
ఆసిఫాబాద్, సెప్టెంబర్ 25(విజయ క్రాంతి): విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన్(Vidya Bharati Akhil Bharatiya Shiksha Sansthan) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘నమామి భారతం’ వందేమాతరం(Vande Mataram) సామూహిక గాన కార్యక్రమంలో భాగంగా ఆసిఫాబాద్‌లో సుమారు 2,500 మంది విద్యార్థులు(Students), ఉపాధ్యాయులు(Teachers) పాల్గొన్నారు. శ్రీ సరస్వతీ శిశుమందిర్ ఆధ్వర్యంలో నాలుగు కళాశాలలు, ఏడు ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థులు శుక్రవారం సామూహికంగా వందేమాతరం ఆలపించారు. శ్రీ సరస్వతీ శిశుమందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల(Sri Saraswati Shishu Mandir English Medium School)లో జరిగిన కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ మేంగ్రే ఆకాష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మంచిర్యాల విభాగ్ కార్యదర్శి దహెగాం గోవిందరావు మాట్లాడుతూ స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో బంకించంద్ర ఛటర్జీ రచించిన వందేమాతరం గేయం ప్రజల్లో స్ఫూర్తిని నింపిందన్నారు. విద్యార్థులు పూర్తి గేయాన్ని నేర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షుడు చిలువేరు వెంకన్న, బోనగిరి సతీష్‌బాబు, నాగుల శ్రీనివాస్, కొడిపాక వేణుగోపాల్, కల్లూరి సంతోష్, వైష్ణవి, కట్కూరి స్వాతి, కమలాకర్ కిరణ్, ప్రధానాచార్యులు గుండేటి కోటేశ్వరరావు, ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.