నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఖరారు
07-09-2026 | 05:10am
టాలీవుడ్ సీనియర్ స్టార్ నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ(Nandamuri Mokshagna Teja) తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టడానికి సిద్ధమయ్యాడు. ఆదివారం మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న డెబ్యూ మూవీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ‘కూన గుహను వీడింది. సింహంలా అడవిలోకి అడుగు పెట్టింది.
హ్యాపీబర్త్‌డే మోక్షజ్ఞ’ అని మైత్రీ మూవీ మేకర్స్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ను రూపొందిస్తున్న దర్శకుడు మల్లిడి వశిష్ఠ ఈ కథను సిద్ధం చేశారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మిగతా నటీనటులు, టెక్నికల్ టీమ్ వివరాలను మేకర్స్ వెల్లడించనున్నారు.






