NEET PG Results.. కటాఫ్ ఎంతంటే?

24-09-2026 | 05:55pm

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వైద్య విద్యలో పీజీ ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పీజీ-2026(NEET-PG 2026) ఫలితాలను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్(NBEMS) గురువారం విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రోల్ నంబర్ ఆధారంగా ఫలితాలు, ర్యాంకును చెక్ చేసుకోవచ్చు. మొత్తం 720 మార్కులకు జనరల్/ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 262, జనరల్ పీడబ్ల్యూబీపీకి 244, ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ కేటగిరీలకు 226 మార్కులను క్వాలిఫైయింగ్ కటాఫ్‌గా నిర్ణయించారు. వ్యక్తిగత స్కోర్‌కార్డులు అక్టోబర్ 1 నుంచి అందుబాటులోకి రానున్నాయి. అదే సమయంలో ఫైనల్ ఆన్సర్ కీ కూడా విడుదల కానుంది. కటాఫ్ సాధించినంత మాత్రాన సీటు ఖరారు కాదని ఎన్బీఈఎంఎస్ స్పష్టం చేసింది.

Click Here: National Board of Examinations in Medical Sciences 

మరిన్ని వార్తలు