7 September, 2026 | 7:26 AM

కొత్త యాష్ టెండర్ విధానం

07-09-2026 | 05:30am
  1. స్థానిక కాంట్రాక్టర్ల ఉపాధికి గండం
  2. కాలుష్య ప్రాంత యువతకు మొండి చేయి 
  3. తక్షణమే రద్దు చేయాలంటూ డిమాండ్ 

భద్రాద్రి కొత్తగూడెం సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): రాష్ట్రంలో తెలంగాణ జెన్కో యాజమాన్యం (Telangana Genco Management) బూడిద తోలకాల్లో ఎంచుకున్న నూతన టెండర్ విధానం కాలుష్య ప్రభావిత ప్రాంత యువత నోట్లో బూడిద కొట్టే విధంగా ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి. బూడిద తరలింపులో భారీ కుంభకోణం నెలకొని ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

గత పది సంవత్సరాలుగా బూడిద తరలింపు పై అనేకమంది స్థానిక యువత సొసైటీలు గా ఏర్పడి బూడిద తరలింపు, యజమానులుగా, డ్రైవర్లుగా కార్మికులుగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. తాజాగా జెన్కో యాజమాన్.

రాష్ట్రంలోని కేటీపీఎస్ (పాల్వంచ), కే టి పి పి (భూపాల్ పల్లి), బి టి పి ఎస్ (మణుగూరు), వై టి పి ఎస్ (దామరచర్ల) ప్రాంతాల్లోని బూడిద చెరువుల నుంచి బూడిదను తరలించేందుకు జన్కో యాజమాన్యం మూడో సంవత్సరాల కాలపర్మతి తో నాలుగు ధర్మల్ స్టేషన్లకు ఒకే కాంట్రాక్టుర్ గా ఉండేలా 1,37,41,520 మెట్టెకు ట న్నుల యాషను రూ 92 కోట్ల వార్షిక అంచనాతో టెండర్ తీసుకోవచ్చని ప్రకటించారు.

టెండర్ 300 కోట్ల నెట్వరత్, కనీసం వంద టిప్పర్లు, ప్రతి ధర్మల్ పవర్ స్టేషన్ నుంచి ఏడాదికి 20 లక్షల మెట్రిక్ టన్నుల యాష్ తరలించిన అనుభవం కలిగిన వారే అర్హులనే ప్రకటించడం గమనార్హం. ఈ విధానం వల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా భారీ సంస్థలకు లాభం చేకూర్చేలా ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బూడి ద సమర్థవంతంగా వినియోగించు కోనేలా నాలుగు ధర్మల్ పవర్ స్టేషన్లను ఒకే భారీ పాకేజీగా ఏర్పాటు చేసి వందల కోట్ల టర్నోవర్, భారీ వాహనాలు అర్హతలు పెట్టడం బాధాకరం.

ఫలితంగా కాలుష్య ప్రభావిత ప్రాంత ప్రజలకు ఉపాధి కోల్పోయే ప్రమా దం పొంచి ఉంది. జన్కో యాజమాన్యం పు నర్ పరిశీలన చేసి పాత టెండర్ విధానాన్ని అమలు చేస్తూ స్థానిక యువతకు ఉపాధి అ వకాశాలు కల్పించాలని, లేదంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరిస్తున్నారూ.

షెడ్యూలు విడుదలపై భిన్న అనుమానాలు 

టీఎస్ జెన్కో  బూడద తరలింపు నిమిత్తం విడుదల చేసిన టెండర్ షెడ్యూల్ పై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. అనుయాయులకు కట్టబెట్టేందుకే ఈ  షెడ్యూల్ విడుదల చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి . ఈనెల 3వ అదే సాయంత్రం షెడ్యూల్ ను ప్రకటించిన జెన్కో యాజమాన్యం, ఈనెల 7వ తారీకు ఉదయం 11 గంటల వరకు సమయం కేటాయించటం పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నాలుగు రోజుల వ్యవధిలో మూడు రోజులు సెలవు దినాలు కావడం గమనార్హం. పథకం ప్రకారమే జన్కో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు కుమ్మక్కై కార్పొరేట్ కంపెనీలతో లోపాయకార ఒప్పందం కుదుర్చుకొని, ఎవరు కూడా కోర్టును ఆశ్రయించడానికి వీలులేని విధంగా షెడ్యూల్ విడుదల చేసినట్లు ,ఈ వ్యవహారంలో పెద్ద మొత్తంలో జన్కో అధికారులకు డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలు తలెత్తుతున్నాయి.

మరిన్ని వార్తలు