గణపతి నిమజ్జన ఉత్సవ సమితి నూతన కార్యవర్గం

17-09-2026 | 12:51pm

హుజురాబాద్, సెప్టెంబర్17: (విజయ క్రాంతి): హుజురాబాద్(Huzurabad) పురపాలక సంఘం ఆధ్వర్యంలో 2026 సంవత్సరానికి గణపతి నిమజ్జన ఉత్సవ సమితి నూతన కార్యవర్గాన్ని గురువారం ఎన్నుకున్నారు. నవరాత్రులు, నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా, సజావుగా జరిగేలా వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేస్తూ సమితి పనిచేయనుంది.

అధ్యక్షుడిగా బుర్ర నటరాజ్, ఉపాధ్యక్షులుగా కన్నన్ దురైరాజ్, నల్లగొని రాకేష్, కోరపల్లి సురేష్, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ విష్ణుదాసు గోపాల్‌రావు, సహకార్యదర్శులుగా సందీప్ ఐత, పంజాల సతీష్, కోశాధికారిగా కొమురవెల్లి సంతోష్ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా బుసారపు శ్రీనివాస్, ఆకుల సదానందం, నూనె సదానందం, కందుల సందీప్, నాగ కోయల్కర్ సుమన్, మేకల మల్లేష్ తదితరులు ఎన్నికయ్యారు.

మరిన్ని వార్తలు