నూతన గ్రంథాలయాన్ని వెంటనే ప్రారంభించాలి

13-09-2026 | 04:27pm

ముకరంపుర, సెప్టెంబర్ 13(విజయ క్రాంతి): కరీంనగర్ జిల్లాలో నిర్మాణం పూర్తయిన నూతన గ్రంథాలయాన్ని వెంటనే ప్రారంభించి నిరుద్యోగ యువత, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు అందుబాటులోకి తీసుకురావాలని DYFI కరీంనగర్ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది.ఈ సందర్భంగా అదివారం నాడు DYFI జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన గ్రంథాలయాన్ని సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు.

అనంతరం DYFI జిల్లా కార్యదర్శి నరేష్ పటేల్ మాట్లాడుతూ.. ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందన్నారు.ఉదయం నుంచి రాత్రి వరకు గ్రంథాలయంలో చదువుకునే విద్యార్థులకు ప్రశాంతమైన వాతావరణం, సరిపడా సీటింగ్‌తో పాటు అవసరమైన మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.అభ్యర్థుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని నిర్మించిన నూతన గ్రంథాలయ భవనం పూర్తయి సిద్ధంగా ఉన్నప్పటికీ ఇప్పటికీ ప్రారంభించకపోవడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.అందువల్ల నూతన గ్రంథాలయాన్ని ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు