OTTలోకి వచ్చేసిన కొత్త మూవీస్
థియేటర్ల నుంచి OTTకి.. ఈరోజు 3 సినిమాల స్ట్రీమింగ్!
థియేటర్లలో సందడి చేసిన సినిమాలు ఇప్పుడు ఓటీటీ(OTT Movies September 2026) ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేశాయి. ఈ శుక్రవారం తెలుగు ప్రేక్షకులకు మూడు ఆసక్తికరమైన సినిమాలు డిజిటల్ ప్రీమియర్స్‌గా అందుబాటులోకి వచ్చాయి. అల్లరి నరేష్ నటించిన ‘రంభ ఊర్వశి మేనక’ Amazon Prime Videoలో స్ట్రీమింగ్ అవుతోంది. ఫాంటసీ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో సురభి, రాశి సింగ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.
మరోవైపు ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహించిన హారర్ థ్రిల్లర్ ‘అగథ’ ZEE5లోకి వచ్చేసింది. సస్పెన్స్, హారర్ అంశాలతో తెరకెక్కిన ఈ మూవీ ఓటీటీలో కొత్త అనుభూతిని అందించనుంది. నయనతార, కవిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘హాయ్’ కూడా ZEE5లో స్ట్రీమింగ్ మొదలుపెట్టింది. ఆగస్టు 28న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఇంట్లోనే చూసే అవకాశం ప్రేక్షకులకు లభించింది. అంటే.. థియేటర్లకు వెళ్లే టైమ్ లేకపోతే ఈ వీకెండ్ OTTలో మీ వాచ్‌లిస్ట్ రెడీ చేసుకోవచ్చు!