భూముల రీ సర్వే ప్రక్రియ వేగవంతంగా చేయాలి
నిర్మల్,(విజయక్రాంతి): జిల్లాలో భూ సమస్యలకు సంబంధించి అన్ని దరఖాస్తులను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా(Collector Bhavesh Mishra) అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో భూ సంబంధిత దరఖాస్తుల(Pending land-related applications) పరిష్కారం, భూముల రీ సర్వే(Land resurvey)పై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మండలాల వారిగా పెండింగ్ లో ఉన్న భూ భారతి, రెవెన్యూ సదస్సులు, సదాబైనమా, దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని అన్నారు. జిల్లాలో కొనసాగుతున్న భూముల రీ సర్వే ను త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు. సర్వే బృందం మొత్తం తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో ఉండాలన్నారు.ఈ సమావేశంలో ఇన్ ఛార్జ్ అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాథోడ్ రమేష్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, డిప్యూటీ కలెక్టర్ రాకేష్, ఆర్డీవో దేవీదాస్, రెవెన్యూ, సర్వే శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.