రైతు ఉత్పత్తి సంఘాలను బలోపితం చేద్దాం
03-10-2026 | 06:06pm
ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా(Nirmal District)లో రైతు ఉత్పత్తి సంఘాల సభ్యత్వం పూర్తిచేసి సంఘాలను బలోపితం చేయాలని జిల్లా సహకార శాఖ అధికారి సత్యనారాయణ(District Cooperative Officer Satyanarayana) అన్నారు. సహకార సంఘంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. 2000 రూపాయలతో సభ్యత్వం తీసుకున్న వారికి కలిగే ప్రయోజనాలను వివరించారు. సహకార సంఘాల ద్వారా రైతులకు చేయూతనందిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఈఓ శ్రీనివాస్ రెడ్డి అధికారులు పాల్గొన్నారు