ప్రజావాణికి నిల్
05-10-2026 | 02:54pm
బోథ్,(విజయక్రాంతి) సోనాల మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి దరఖాస్తులు రాలేదు. నోడల్ అధికారి ఎంపీడీవో రత్నాకర్ రావు, తో పాటు ఇతర మండల అధికారులు పాల్గొని దరఖాస్తుదారుల కోసం వేచి చూశారు. ఈ సందర్భంగా నోడల్ అధికారి మాట్లాడుతూ ప్రజలు ప్రజావాణిలో తమ సమస్యలపై దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రజావాణిలో ఇచ్చిన దరఖాస్తులకు పరిష్కారం ఉంటుందని పేర్కొన్నారు.