22-ఏపై ఆందోళన వద్దు
- పేదల భూములకు సంపూర్ణ రక్షణ
- పొరపాటును ఒప్పుకున్నాం సరిదిద్దే బాధ్యత మాదే
- ‘ధరణి’తప్పులను బీఆర్‌ఎస్‌కు అంగీకరిస్తుందా?
- హరీష్‌రావు కాదు.. అబద్ధాల రావు
- మంత్రి పొంగులేటి ఫైర్
హైదరాబాద్, ఆగస్టు 18 (విజయక్రాంతి) : పేదల ఆశీస్సులతో అధికారంలోకి వచ్చిన తమ ఇందిరమ్మ ప్రభుత్వం.. ఎట్టి పరిస్థితుల్లోనూ పేదవారికి అన్యాయం చేయదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. న్యాయబద్ధమైన భూమిలో ఒక్క అంగుళం కూడా ఈ ప్రభుత్వం తీసుకోదని, వారి హక్కులు, ఆస్తులకు సంపూర్ణ రక్షణ కల్పిస్తామన్నారు. అబద్ధాలు, ఆరోపణలు, రాజకీయ ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించలేరని, తప్పు జరిగితే దాన్ని అధికారుల మీదకు నెట్టేసి చేతులు దులుపుకోవడం త మ ప్రభుత్వ విధానం కాదని స్పష్టం చేశారు.
పదేళ్లు అధికారంలో ఉన్న హరీశ్ రావుకు ఇప్పటికీ 30 శాతం కమీషన్లు ఎందుకు గుర్తుకొస్తున్నాయో ప్రజలకు తెలుసు.. వాళ్లు ఏ పద్ధతిలో పాలన సాగించారో ప్రజ లు మరిచిపోలేదని, హరీశ్‌రావు అబద్దాలరావుగా మారాడని ఆయన ఎద్దేవా చేశారు. మంగళవారం సచివాలయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. 22ఏ నిషేధిత జాబితా వల్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
ఈ సమస్య పరిష్కార ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, 24 గంటల్లోనే మేడ్చల్ జిల్లాలో 30, రంగారెడ్డి జిల్లాలో 4 వంతున రిజిస్ట్రేషన్లు కూడా జరిగాయన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు 22ఏ నిషేధిత భూముల వివరాలను ఆన్‌లైన్ సాప్ట్‌వేర్‌లో అప్‌లోడు చేసే క్రమం లో క్షేత్ర స్థాయిలో జరిగిన పొరపాట్లను ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సరిదిద్దుతుందన్నారు. పొరపాటును పారదర్శకంగా అం గీకరించామన్నారు. అదే సమయంలో జరిగిన తప్పును సరిదిద్దే బాధ్యతను కూడా తీసుకున్నామని స్పష్టం చేశారు.
కమిటీ ఏర్పాటు చేశాం
22ఏ సమస్యల త్వరిత పరిష్కారం కోసం రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజీ, ఇతర ఉన్నతాధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని మంత్రి పొంగులేటి అన్నారు. రాబోయే 15 రోజుల పాటు ఈ కమిటీ రోజువారీగా దరఖాస్తులను పరిశీలించి జెన్యూన్ ప్రైవేట్ ఆ స్తులన్నింటినీ తక్షణమే క్లియర్ చేసేలా చర్య లు తీసుకుంటామన్నారు.
కావాలనే 22ఏలో భూములు పెట్టి, వాటిని తొలగించడానికి డబ్బులు వసూలు చేస్తున్నారంటూ బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావు చేస్తున్న ఆరోపణలపై మంత్రి పొంగులేటి స్పందించారు. ‘విమర్శ లు చేయడం చాలా సులువు.. కానీ బాధ్యత తీసుకోవడం అంత సులువు కాదు. 22ఏ విషయంలో పొరపాటు జరిగిందని మేం బహిరంగంగా అంగీకరించాం.. ఆ పొరపాటును సరిదిద్దే బాధ్యతను కూడా తీసుకు న్నాం.
వారు పదేళ్లు అధికారంలో ఉన్నప్పు డు ధరణి పేరుతో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులకు, జరిగిన తప్పులకు ఏనాడైనా బా ధ్యత తీసుకున్నారా..? కనీసం క్షమాపణ చెప్పారా..? ఇప్పుడు పేదవాడి సమస్యను రాజకీయంగా వాడుకోవడం మానేయండి. మేం తప్పును ఒప్పుకుని దిద్దుతున్నాం.. మీరు చేసిన తప్పులను ఒప్పుకునే ధైర్యం మీకుందా..? ’ అని మంత్రి పొంగులేటి ప్రశ్నించారు.
మహేశ్వర్‌రెడ్డి ఆధారాలు చూపాలి
బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేస్తున్న ఆరోపణలపై మంత్రి పొంగులేటి స్పందించారు. తాటాకు చప్పుళ్లకు నేను భ యపడను. నాపై ఏదైనా ఆరోపణ చేస్తే ఆధారాలతో మాట్లాడాలి. ఆధారం ఉంటే ప్రజల ముందు పెట్టాలి. ఫీనిక్స్, రాఘవ తదితర సంస్థలతో వ్యాపార రంగంలో లావాదేవీలు జరగడం సహజం.
వాటిని పట్టుకుని రాజకీ య ఆరోపణలు చేయడం సరికాదన్నారు. తాను రెండు దశాబ్దాలుగా వ్యాపార రంగం లో ఉన్నాను. అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి వచ్చానన్నారు. ఒక్కరోజులో రూ. వేల కోట్లకు ఎదిగిన వ్యక్తిని కాదు. నా వ్యా పార ప్రస్థానం, నా నేపథ్యం గురించి ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసునన్నారు. ఆరోపణలు చేసేవారు ముందుగా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని మంత్రి హితవు పలికారు.






