7 September, 2026 | 6:08 AM

నర్సుహత్య.. విచారణ వేగవంతం

07-09-2026 | 04:50am
  1. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
  2. కుటుంబానికి అండగా తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): తుక్కుగూడలో నర్సు లైంగికదాడి, హత్యను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీవ్రంగా పరిగణించారు. ఈ ఘటనపై సమగ్రంగా మేజి స్ట్రీరియల్ విచారణ (Magician's Real Inquiry) వేగవంతం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఘటనకు దారితీసిన పరిస్థితులు, బాధితురాలు ఉం టున్న వసతి ప్రదేశంలో భద్రతా ఏర్పాట్లు, సంబంధిత సంస్థ నిర్వహణలో లోపాలు, మహిళా ఉద్యోగుల భద్రత విషయంలో పాటించాల్సిన నిబంధనల అమలు  పరిశీలించాలని సీఎం ఆదేశించారు.

ఈ కేసులో ఇప్పటికే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు, ఫోరెన్సిక్, ఇతర సాంకేతిక ఆధారాలను వేగవంతం చేసి చార్జీషీట్ దాఖలు చేయాలని సీఎం ఆదేశించారు. బాధితురాలికి సత్వర న్యాయం అందేలా ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేపట్టేందుకు అవసరమైన చర్యలు ప్రారంభించాలన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లు, ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్కలు ప్రకటించారు.

మరిన్ని వార్తలు