పోషకాహారం తీసుకోవాలి

10-09-2026 | 12:23am

బూర్గంపాడు,(విజయక్రాంతి): గర్భిణులు, బాలింతలు అంగన్వాడీ కేంద్రాల్లో(Anganwadi Center) అందించే పోషకాహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలని సెక్టార్‌ సూపర్‌వైజర్‌ స్వరాజ్యం సూచించారు. మోరంపల్లిబంజరు సెక్టార్‌ పరిధిలోని ఎంపీబంజరు-4 అంగన్వాడీ కేంద్రంలో బుధవారం పోషణ మాసోత్సవాలు(Nutrition Month celebrations) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గర్భిణులు పౌష్టికాహారం తీసుకుంటే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతుందని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

మరిన్ని వార్తలు