తాండూరు గ్రామంలో పోషక వారోత్సవం
16-09-2026 | 09:49pm
నాగిరెడ్డిపేట్,(విజయ క్రాంతి): మండలంలోని తాండూర్ గ్రామం(Tandur village)లో గల అంగన్వాడీ మూడవ పోషక వారోత్సవాలు(Nutrition Week celebrations) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచి భూమా యాద గౌడ్ మాట్లాడుతూ... పిల్లలకు, తల్లులకు, బాలింతలకు పోషకాహారం ఉపయోగాలు బాలామృతం వాటి ఉపయోగాలు వివరించారు. సామ్, మామ్ పిల్లల పట్ల తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించారు.
పిల్లలకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని, అంగన్వాడి ద్వారా అందజేసే పౌష్టికాహారం పట్ల అశ్రద్ధ వహించకుండా బాలింతలు తప్పకుండా తీసుకొని వాడుకోవాలన్నారు.పాలు, గుడ్లు, ఆహారం క్రమం తప్పకుండా తీసుకొని ఆరోగ్యంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భూమా యాద గౌడ్, ఉపసర్పంచ్ అభిషేక్, ఎం.ఎల్.హెచ్.పి అపర్ణ, అంగన్వాడి టీచర్ ముత్యాల మారియా, సంగీత తదితరులు పాల్గొన్నారు.