కులగణనలో ఓబీసీ కాలమ్ చేర్చాలి
- కేంద్రంపై ప్రత్యేక్ష పోరాటం
- 11న జిల్లాల్లో ధర్మ పోరాట దీక్షలు
- 20న హైదరాబాదులో జాతీయ ఓబీసీ సదస్సు
- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్
ముషీరాబాద్, సెప్టెంబర్ 6(విజయక్రాం తి): బీసీ కులగణనలో ఓబీసీ కాలమ్‌ను చే ర్చాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాట కార్యాచరణ చేపడతామని బీసీ సంక్షేమ సంఘం (BC Welfare Association) జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. ఆదివారం లక్డికాపూల్‌లోని బీసీ సంక్షేమ సం ఘం కార్యాలయంలో ధర్మ పోరాట దీక్షల వాల్ పోస్టర్‌ను పలువురు బీసీ సంఘాల నేతలతో కలిసి ఆవిష్కరించారు. ఈ నెల11న జిల్లా కేంద్రాల్లో ధర్మ పోరాట దీక్షలు, 20న హైదరాబాద్‌లో జాతీయ ఓబీసీ సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు.
నవంబర్‌లో పార్లమెంట్ ముట్టడి చేపడతామన్నారు. ఓబీసీ కాలమ్ లేకుండా జనాభా లెక్కల ప్రశ్నావళిని రూపొందించడాన్ని వ్యతిరేకిస్తూ, కులగణనను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, గుజ్జ కృష్ణ, కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, తాటికొండ విక్రమ్ గౌడ్, కనకాల శ్యాంకుర్మా, రా వులకోల్ నరేష్ ప్రజాపతి, జాజుల లింగం గౌడ్, ఈడిగ శ్రీనివాస్ గౌడ్, డాక్టర్ రమేష్, పానుగంటి విజయ్, గూడూ రు భాస్కర్ మేరు, ఇంద్రమ్ రజక, బ్రహ్మచారి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.






