కంకర వేశారు. తారు మర్చారు..!
మల్యాల, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): మల్యాల మండల(Malyala Mandal) కేంద్రంలోని పెగడపల్లికి వెళ్లే ప్రధాన రహదారిలో కంకర వేసి తారు రోడ్డు (Tar road)వేయడం మరిచారు. దీనివల్ల ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. గత కొన్ని రోజుల కిందట ప్యాచ్ వర్క్(Patchwork) పేరుతో పనులు ప్రారంభించి ఆపేశారు. ఎందుకో కానీ పెగడపల్లి దారి నుంచి మల్యాల దారి, కొండగట్టుకు వెళ్లే దారిలో ప్రయాణించే వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.
రాత్రి, పగలనక టూ వీలర్స్‌పై మహిళలను తీసుకెళ్లే క్రమంలో, వేలాది మంది కొండగట్టుకు వచ్చే భక్తులు, హనుమాన్ దీక్షాపరులు, ఆటోల్లో ప్రయాణించే ప్రయాణికులు, ఇతర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులు, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ప్యాచ్ వర్క్ పనులు త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు. పెగడపల్లి నుంచి కొండగట్టు వరకు ప్రయాణించే ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా తారు ప్యాచ్ వర్క్ పూర్తి చేయాలని కోరుతున్నారు.






