అధికారులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరే విధంగా చూడాలి

22-09-2026 | 05:54pm

బోథ్ సెప్టెంబర్ 22 ( విజయక్రాంతి) ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను(Welfare schemes) ప్రజలకు చేరే విధంగా అధికారులు చూడాలని బోత్ బ్లాక్  ఆత్మ చైర్మన్ రాజు యాదవ్ కోరారు. మంగళవారం సమల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ప్రత్యేక అధికారి రామకృష్ణ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీల సర్పంచులు సంక్షేమ పథకాలను అర్హులకు చేరే విధంగా చూడాలన్నారు ప్రభుత్వం నిధులను నేరువ గ్రామపంచాయతీలకు పంపించడం జరుగుతున్నందున నిధులను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సర్పంచుల ఇబ్బందులను గమనించి నేరుగా పంచాయతీ అకౌంట్లో డబ్బులు జమ చేసేందుకు జీవో విడుదల చేయడం హర్షించదగ్గ విషయం అన్నారు. అయితే ప్రభుత్వం ఈసారి 100% సబ్సిడీతో సోయా పత్తి విత్తనాలను అందించింది అన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. ఎంపీడీవో రత్నాకర్ రావు తాసిల్దార్ మల్లేశం సర్పంచ్ల సంఘం అధ్యక్షులు వినోద్ తోపాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు