ప్రజావాణికి అధికారుల డుమ్మా..!

07-09-2026 | 01:58pm

నాగల్‌గిద్ద, సెప్టెంబర్ 7 ( విజయ క్రాంతి) : మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి(Public Voice) కార్యక్రమానికి ఎంపీడీవో(MPDO) మహేశ్వరరావు, ఏపీఎం(APM) నర్సింహులు, ఎంపీఓ ఇందిరమ్మ(MPO Indiramma), ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ మాత్రమే హాజరయ్యారు. నిర్ణీత సమయానికి పలువురు అధికారులు హాజరుకాకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించాల్సిన అధికారులు ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించకపోవడం పట్ల ఉన్నతాధికారులు స్పందించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు