వెయ్యి రోజుల్లో ప్రతి కుటుంబానికి ఏదో ఒక ప్రభుత్వ సంక్షేమ పథకం
- ప్రజా వికాస సభకు ప్రజల సంపూర్ణ మద్దతు
- ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
నల్లగొండ/నకిరేకల్,సెప్టెంబర్ 6 : కాంగ్రెస్ ప్రజా పాలనలో వెయ్యి రోజుల్లో ప్రతి కుటుంబానికి ఏదో ఒక సంక్షేమ పథకం లబ్ధి జరిగిందని నకిరేకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ వేముల వీరేశం (Nakirekal MLA Government Whip Vemula Veeresham) అన్నారు. ఆదివారం పట్టణంలోని పన్నాలగూడెం క్యాంపు కార్యాల యంలో నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడారు
నకిరేకల్ లో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా వికాస సభకు వేలాదిగా ప్రజలు తరలివచ్చి రాష్ట్ర ప్రభుత్వ వెయ్యి రోజుల ప్రజాపాలనకు మద్దతు తెలిపారని అన్నారు. సభను విజయవంతం చేసిన ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.
నకిరేకల్ కు సీఎం ఇచ్చిన వరాలు - రూ. 339 కోట్ల అభివృద్ధి పనులు,-రూ.32 కో ట్లతో 100 పడకల ఏరియా ఆసుపత్రి ప్రారంభం,రూ.200 కోట్లతో యంగ్ ఇం డియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ రూ.45.60 కో ట్లతో రోడ్ల నిర్మాణం- రూ.17.50 కోట్లతో నకిరేకల్ పట్టణ రోడ్లు- రూ.12 కోట్లతో నకిరేకల్, చిట్యాల మున్సిపాలిటీ కార్యాలయాలు- రూ. 20 కోట్లతో ప్రభుత్వ కార్యాలయాల సముదాయం- రూ.9.85 కోట్లతో తెలంగాణ పబ్లిక్ స్కూల్‌రూ.1.10 కోట్లతో ఎక్సైజ్ కార్యాలయం,
రూ.90 లక్షలతో వెటర్నరీ ఆసుపత్రి, -మహిళా సంఘాలకు రూ.127 కోట్ల చెక్కు అందజేత,ఆసిఫ్ నగర్ కెనాల్ ద్వారా 60 చెరువులు నింపేందుకు నిధులు మంజూరు చేస్తామని సీఎం హామీ ఇచ్చారని, నకిరేకల్-తిప్పర్తి, కట్టంగూర్- నల్లగొండ రోడ్ల అభివృ ద్ధి, కట్టంగూర్ లో అండర్ పాస్, మినీ స్టేడియానికి రూ.10 కోట్లు, చెరువుగట్టు ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం, మహిళలకు ఉచిత బస్సు,
ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 10 లక్షల కు ఆరోగ్యశ్రీ పెంపు తో ప్రజలకు అండగా ఉన్నామన్నారు. వెయ్యి రోజుల పాలనలో ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకంలో ఏదో ఒక లబ్ధి ప్రతి కుటుంబానికి జరిగిందన్నారు నకిరేకల్ కు ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయాలని సీఎం ను కోరినట్లు తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.






