7 September, 2026 | 8:31 AM

అందుబాటులోకి వంద పడకలు

07-09-2026 | 05:35am
  1. నకిరేకల్‌లో ఎన్ హెచ్ 65పై దవాఖాన ప్రారంభం 
  2. కోదాడ ఎల్బీనగర్ మధ్య తీరిన దశాబ్దాల వైద్య కొరత
  3. ‘గోల్డెన్ అవర్’లో సకాలంలో వైద్య సేవలకు మార్గం సుగమం
  4. సామాన్యుడికి కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్య భరోసా
  5. హర్షం వ్యక్తం చేస్తున్న నకిరేకల్ ప్రజలు, హైవే ప్రయాణికులు
  6. ఎమ్మెల్యే వీరేశం, సీఎం రేవంత్ రెడ్డిలకు కృతజ్ఞతలు వెల్లువ

నల్లగొండ/ కట్టంగూర్ సెప్టెంబర్ 6 (విజయక్రాంతి) : హైదరాబాద్ - విజయవాడ (ఎన్హెచ్-65) జాతీయ రహదారిపై (National Highway) ప్రయాణిం చే వాహనదారులకు, నకిరేకల్ నియోజకవర్గ (Nakirekal Constituency)  పరిధిలోని వందలాది గ్రామాల ప్రజల కు దశాబ్దాలుగా వేధిస్తున్న అతిపెద్ద వైద్య స మస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది.

కోదాడ నుంచి ఎల్బీనగర్ వరకు సుమారు 180 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ బిజీ జాతీయ రహదారిపై సూర్యాపేట మెడికల్ కాలేజీ మినహా అత్యవసర వైద్యం అందించే పెద్ద ప్రభుత్వ ఆస్పత్రి ఏదీ లేకపోవడంతో నిత్యం ఎంతోమంది బాధితులు ప్రాణాలు కోల్పోతుండేవారు. ఈ కష్టాలకు చరమగీతం పాడుతూ నకిరేకల్ పట్టణంలో ఆధునిక వసతులతో కూడిన 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి అందుబాటులోకి వచ్చింది.

నిజానికి హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై వాహనం వేగం పెరిగిన ప్రతిసారీ.. ప్రయాణికుల గుండెల్లో రైళ్లు పరిగెడుతాయి. నిమిషాల వ్యవధిలో జరిగే రోడ్డు ప్రమాదాలు ఎన్నో కుటుంబాల్లో నింపే విషాదం మాటలకందనిది. అయితే ఇప్పటిదాకా ’మరణ మృదంగం’ మోగించిన అదే హైవేపై, నేడు నకిరేకల్ వేదికగా ఒక పచ్చటి ప్రాణదీపం వెలిగింది. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ అందుబాటులోకి వచ్చిన ’నకిరేకల్ 100 పడకల ఏరియా ఆస్పత్రి’ కేవలం ఒక ప్రభుత్వ భవనం కాదు..

వేలాది ప్రాణాలను నిలబెట్టే దివ్య సంజీవని అని చెప్పాలి. దీని ఏర్పాటుకు కృషిచేసిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీ రేశం, నిధులు మంజూరు చే యడంతో పాటు దవాఖాన ప్రారంభానికి వచ్చిన రాష్ట్ర ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్థానిక ప్రజ లు, జాతీయ రహదారి 65 పై ప్రయాణించే పలువురు ప్రయాణికులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

 గోల్డెన్ అవర్లో ప్రాణ రక్షణ :

 దేశంలోనే అత్యంత బిజీగా ఉండే జాతీ య రహదారుల్లో ఒకటైన ఎన్హెచ్-65 పై ని త్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. హైదరాబాద్ - విజయవాడ ఆ రు వరుసల జాతీయ రహదారిపై కోదాడ నుంచి ఎల్బీనగర్ మధ్య దాదాపు 180 కిలోమీటర్ల పరిధిలో సూర్యాపేట మినహా పెద్ద ఆస్పత్రులేవీ లేవు.

ప్రమాదం జరిగిన తర్వా త మొదటి గంట (గోల్డెన్ అవర్) బాధితుడికి అత్యంత కీలకం. కానీ, నకిరేకల్, కట్టం గూర్, కేతేపల్లి ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులను నల్లగొండకో, హై దరాబాద్కో తరలించే లోపే మార్గమధ్యంలోనే శ్వాస ఆగిపోయిన ఘటనలు కొన్ని వందలు. ఈ ఘోర కష్టాలకు నకిరేకల్ 100 పడకల దవాఖానా చెక్ పెట్టింది. 24/7 ట్రా మా కేర్, అధునాతన ఐసీయూ బెడ్లు, ఆర్థోపెడిక్ సర్జరీ విభాగాలు ఇక్కడ సిద్ధంగా ఉండ టంతో క్షతగాత్రులకు తక్షణమే నకిరేకల్లోనే ప్రాణరక్షణ లభిస్తోంది.

ఎమ్మెల్యే వేముల వీరేశం కృషి పలితం 

గత కొంతకాలంగా మందకొడిగా సాగిన ఈ ఆస్పత్రి నిర్మాణ పనులను వేగవంతం చేయడంలో నకిరేకల్ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ వేముల వీరేశం ప్రత్యేక చొరవ చూపారు. నియోజకవర్గ ప్రజలతో పాటు హైవేపై వెళ్లే ప్ర యాణికుల ప్రాణ రక్షణే ధ్యేయంగా ఆ యన నిరంతరం పనులను సమీక్షించారు. సంబంధిత అధికారులతో వరుస సమీక్షలు నిర్వహించి, నిధులు మంజూరు చేయించడ మే కాకుండా నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చూసి ఆస్పత్రిని శరవే గంగా అందుబాటులోకి తీసుకువచ్చారు.

 ఒకే ఛత్రం కిందకు కార్పొరేట్ వైద్యం 

కేవలం హైవే ప్రమాద బాధితులకే కా కుండా, నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని వందలాది గ్రామాల సామాన్య, మధ్యతర హా ప్రజలకు ఈ ఆస్పత్రి కార్పొరేట్ స్థాయి వై ద్యాన్ని ఉచితంగా అందిస్తోంది. సాధారణ శస్త్రచికిత్సలతో పాటు అత్యవసర ఎము కల ఆపరేషన్లకు సైతం అనుకూలంగా మారనుంది. గర్భిణులకు సుఖ ప్రసవాలు, ప్రస వానంతర సంరక్షణ, నవజాత శిశువులకు ఐ సీయూ సేవలు.. రోగ నిర్ధారణ కోసం అత్యాధునిక డిజిటల్ ఎక్స్-రే, స్కాన్ యూనిట్లు మ రియు 24 గంటల పాథాలజీ ల్యాబ్ అందుబాటులోకి రానున్నాయి.

దీంతో పాటు రో గులతో పాటు వచ్చే సహాయకులు పడే యా తనలను దృష్టిలో ఉంచుకుని ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తాగునీటి ప్లాంట్లు, పరిశుభ్రమైన వెయిటింగ్ హాళ్లు, విస్తారమైన పా ర్కింగ్ వసతులు కల్పించారు. ఆస్పత్రి ప్రాంగణమంతా 24/7 సీసీటీవీ నిఘా, అగ్నిమాపక భద్రతా వ్యవస్థలతో పాటు ప్రత్యేక సెక్యూరిటీ నెట్వర్క్ను ఏర్పాటు చేసి భద్రతకు ఏమాత్రం లోటు రాకుండా చూస్తున్నారు.

మణిహారంగా 100 పడకల ఆస్పత్రి 

నకిరేకల్ పట్టణ ముఖచిత్రాన్ని మార్చేస్తూ, వందలాది మంది ప్రాణాలకు రక్షణ కవచంగా మారిన 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఒకప్పుడు ప్రభుత్వ దవాఖానా అంటేనే భయపడే పరిస్థితి నుంచి, నేడు నకిరేకల్లో అత్యంత ఆధునిక వసతులతో ఈ స్థాయి వైద్య నిలయం రూపుదిద్దుకోవడం ప్రజా ప్రభుత్వ నిబద్ధతకు, స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం దూరదృష్టికి నిదర్శనంగా నిలుస్తోంది.

మొత్తం 100 బెడ్ల సామర్థ్యంతో (ప్రత్యేక ఐసీయూ, అత్యవసర పడకలతో సహా) సిద్ధమైన ఈ ఆస్పత్రిలో 24/7 ట్రౌమా కేర్, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ, పిడియాట్రిక్స్ వంటి కీలక సేవలు అందుబాటులోకి వచ్చాయి. రోగ నిర్ధారణ కోసం డిజిటల్ ఎక్స్-రే, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు 24 గంటల బయోకెమిస్ట్రీ ల్యాబ్ సదుపాయాలను ఏర్పాటు చేశారు. దీనివల్ల నకిరేకల్ పరిసరాల్లోని 100కి పైగా గ్రామాల ప్రజలతో పాటు, 65వ నంబర్ జాతీయ రహదారిపై ప్రయాణించే నిత్య వాహనదారులకు నాణ్యమైన వైద్యం ఉచితంగా దక్కనుంది.

హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు, వాహనదారులు :

అత్యాధునిక ఐసీయూ బెడ్లు, ఆపరేషన్ థియేటర్లు, అత్యవసర వైద్య విభాగాలు, ల్యాబ్ వసతులతో ఈ 100 పడకల ఆస్పత్రి సిద్ధం కావడం పట్ల నకిరేకల్ నియోజకవర్గానికి చెందిన వందలాది గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై సాధారణ వైద్యం కోసం నల్గొండనో, హైదరాబా ద్నో ఆశ్రయించాల్సిన అవసరం లేదని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రతిష్టాత్మక వైద్య ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయించిన ఎమ్మెల్యే వేముల వీరేశం, ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలపై స్థానికులు, ప్రయాణికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.


మరిన్ని వార్తలు