అథ్లెటిక్స్‌లోనూ అదుర్స్
- మారథాన్‌లో సావన్ బర్వాల్ సరికొత్త చరిత్ర
- 44 ఏళ్ల తర్వాత భారత్‌కు పతకం
- షాట్ పుట్‌లో తాజిందర్పాల్‌కు రజతం
- 400 మీ. రేసులో ప్రాచి చౌదరికి కాంస్యం
నగోయా, సెప్టెంబర్ 26 : ఆసియా క్రీడ ల అథ్లెటిక్స్‌లో (Asian Games Athletics)భారత్ మరో మూడు పతకాలను ఖాతాలో వేసుకుంది. అందులో రెండు రజతాలు, ఒక కాంస్యం ఉన్నాయి. అథ్లెట్ సావన్ బర్వాల్ పురుషుల మారథాన్‌లో రజత పతకం సాధించాడు. 42.195 కిలోమీటర్ల రేసులో రెండో స్థానంలో నిలిచి, భారత్ 44 ఏళ్లుగా ఎదురుచూస్తున్న పతకా న్ని అందించాడు. జపాన్‌కు చెందిన ఇచితకా యమషితాకు ఈ ఈవెంట్‌లో స్వర్ణం లభించింది.
1982 ఏషియన్ గే మ్స్‌లో హోసూర్ కుక్కప్ప సీతారన్ కాంస్యం సాధించి న తర్వాత.. పురుషుల మారథాన్ లో భారత్‌కు ఇదే తొలి పతకం. పురుషుల షాట్‌పుట్ ఫైనల్లో తాజిందర్‌పాల్ సింగ్ 20.64 మీటర్ల దూరం విసిరి రజత పతకం సాధించాడు. దీనితో ఆసియా క్రీడల చరిత్రలో వరుసగా మూడు ఎడిషన్లలో పతకాలు సాధించిన అరుదైన రికార్డును సాధిం చాడు. మరోవైపు మహిళల 400 మీటర్ల పరుగు పందెం ఫైనల్లో ప్రాచి 53.21 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని కాంస్య పతకాన్ని గెలుచుకుంది.