7 September, 2026 | 7:27 AM

పాక్ క్రికెటర్ల ఫోన్లు స్వాధీనం

07-09-2026 | 05:15am

పీసీబీ చర్యతో ఫిక్సింగ్ అనుమానాలు?

ఇప్పటికే కీలక ఆటగాళ్లపై వేటు

లండన్, సెప్టెంబర్ 6: ఇంగ్లాండ్ టూర్ లో ఘోర పరాజయాల నేపథ్యంలో పాక్ క్రికెట్‌లో నెలకొన్న సంక్షోభం మరో మలుపు తిరిగింది. ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న పాకిస్థాన్ క్రికెట్ జట్టు(Pakistan Cricket Team) ఆటగాళ్ల మొబైల్ ఫోన్లను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు స్వాధీనం చేసుకుంది.

సెప్టెంబర్ 9 నుంచి ఎడ్గాబెస్టన్ వేదికగా ప్రారంభం కానున్న మూడో చివరి టెస్టు మ్యాచ్ ముగిసే వరకు ఈ ఫోన్లు బోర్డు కస్టడీలోనే ఉంటాయని పాక్ మీడియా సంస్థ వెల్లడించింది. లండన్‌లో జరుగుతున్న ఒక అంతర్గత విచారణలో భాగంగానే పీసీబీ కొంతమంది ఆటగాళ్ల ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. సాధారణంగా ఐసీసీ నిబంధనల ప్రకారం మ్యాచ్ జరిగే రోజుల్లో మాత్ర మే డ్రెస్సింగ్ రూమ్‌లో ఫోన్లపై ఆంక్షలు ఉంటాయి.

అయితే, సిరీస్ మధ్యలోనే ఇలా ఫో న్లను పూర్తిగా స్వాధీనం చేసుకోవడంతో ‘మ్యాచ్ ఫిక్సింగ్ లేదా స్పాట్ ఫిక్సింగ్’ అనుమానాలు ఉన్నాయా అనే కోణంలో తీవ్ర చ ర్చ నడుస్తోంది. అయితే బోర్డు అధికారిక ప్రకటన చేయలేదు. ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి రెండు టెస్టుల్లో పాకిస్థాన్ ఘోర పరాజయం పాలైంది. తొలి టెస్టులో 103 పరుగులు, రెండో టెస్టులో 194 పరుగుల తేడాతో ఓడిపోవడంతో ఇంగ్లాండ్ 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. రిజ్వాన్, ఉల్-హక్, సల్మాన్ అలీ ఆగా, ఖుర్రమ్ షాజాద్‌తో సహా ఏడుగురు ఆటగాళ్లను జట్టు నుంచి తొలగించి స్వదేశానికి పంపించేశారు. పీసీబీ ప్రకంపనలు సృష్టిస్తోంది.

మరిన్ని వార్తలు