పాలెం అలుగులో ప్రభుత్వ మెడిసిన్ కుప్ప
- జీవ వైవిద్యం నష్టమెంత ?
- నాగరుకర్నూలు చెరువుకి నష్టమెంత ?
బిజినేపల్లి, అక్టోబర్ 02 : నిరుపేదలకు అందించే ప్రభుత్వ మెడిసిన్ మండలంలోని పాలెం పెంటోని చెరువు ఆలుగులో కుప్పగా దర్శనం ఇచ్చింది. ప్రభుత్వం మెడిసినులో కొన్ని కాలం చెల్లిన మెడిసిన్ కాగ మరికొన్ని మెడిసిన్ వచ్చే సంవత్సరం వరకు ఉపయోగానికి ఉన్నాయి. పాలెం చెరువు అలుగు పారినప్పుడు ఆ మెడిసిన్ నీటిలో కలవడం వలన పశువులు, పక్షులు, ఇతర జీవ వైవిద్యానికి ప్రాణ, ఆస్తి నష్టం బారీగా జరగవచ్చనే అనుమానాలు ఉన్నాయి.
ఇదిలా ఉంటే పాలెం చెరువు అలుగులో పాడేసిన మెడిసిన్ వలన ఆ చెరువు అలుగు పారినపుడు గొలుసు కట్టు చెరువుగా ఉన్న కేసరి సముద్రం చెరువులో చేపలకు ఎంత నష్టం జరుగుతుందో అని పలువురు మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో మెడిసిన్ లేక నిరుపేదలు బయట డబ్బులకు కొంటుంటే, అందులో పని చేసే సిబ్బంది మాత్రం మెడిసిన్ ను దుర్వినియోగం చేస్తుంది.
కాలం చెల్లిన మెడిసిన్ ప్రభుత్వ వాహనంలో వేసి ప్రత్యేక ప్రదేశాల్లో డిస్పోజ్ చేస్తారు. పాలెం చెరువు అలుగులో కుప్పగా పారేసిన మెడిసిన్ ఫోటోలు స్థానికంగా వైరల్ అయ్యాయి. దీనికి కారణం అయిన వారిపై చర్యలు తీసుకోవాలని మత్స్య కారులు, రైతులు, ప్రజలు కోరుతున్నారు.