ఘనంగా పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి

25-09-2026 | 05:42pm

మంచిర్యాల క్రైమ్, (విజయక్రాంతి) : మంచిర్యాల పట్టణంలోని(Mancherial town) బీజేపీ మంచిర్యాల జిల్లా కార్యాలయంలో(BJP Mancherial District Office) పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతిని(Pandit Deendayal Upadhyaya Jayanti) ఘనంగా నిర్వహించారు. దీన్ దయాళ్ చిత్రపటానికి బీజేపీ నాయకులు, కార్యకర్తలతో(BJP leaders and activists) కలిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి(Raghunath Verabelli) పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రఘునాథ్ వెరబెల్లి మాట్లాడుతూ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఏకాత్మ మానవతావాదం, అంత్యోదయ సిద్ధాంతాల ద్వారా సమాజంలోని చివరి వ్యక్తి అభ్యున్నతే లక్ష్యంగా పనిచేశారని తెలిపారు. దేశం, సమాజం పట్ల అంకితభావంతో ఆయన చేసిన సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. 

దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆశయాలను ముందుకు తీసుకెళుతు పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కస్తూరి నాగరాజు, బీజేపీ నాయకులు అమిరిశెట్టి రాజ్ కుమార్, రంగ శ్రీశైలం, కుర్రే చక్రవర్తి, పట్టి వెంకట కృష్ణ, వంగపల్లి వెంకటేశ్వర్ రావు, నాంపల్లి శ్రీనివాస్, వైద్య శ్రీధర్, ముదాం మల్లేష్, అర్ణకొండ శ్రీనివాస్, బల్ల రవి, రెడ్డిమళ్ళ అశోక్, కొండ వెంకటేష్, తరుణ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు