‘ది ప్యారడైజ్’ .. బుకింగ్స్‌లో బాక్సాఫీస్ రికార్డ్
23-09-2026 | 04:31pm
‘ది ప్యారడైజ్’కు బాక్సాఫీస్ బజ్
రిలీజ్‌కు ముందే రూ.22.69 కోట్ల గ్రాస్!
నేచురల్ స్టార్ నాని నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్’ విడుదలకు ముందే బాక్సాఫీస్(Box Office) వద్ద తన సత్తా చాటుతోంది. ఏపీ, తెలంగాణల్లో అడ్వాన్స్ బుకింగ్స్(Advance bookings)కు భారీ స్పందన లభిస్తోంది. ఇప్పటివరకు ప్రీమియర్స్, తొలి రోజు అడ్వాన్స్ సేల్స్ కలిపి రూ.22.69 కోట్ల గ్రాస్ నమోదైంది.
తెలంగాణ నుంచి రూ.14.05 కోట్లు రాగా.. ఇందులో హైదరాబాద్ వాటానే రూ.11.40 కోట్లు. ఏపీ నుంచి రూ.8.64 కోట్ల గ్రాస్ వచ్చింది. వైజాగ్, సీడెడ్, ఈస్ట్, గుంటూరు, కృష్ణా ప్రాంతాల్లోనూ టికెట్ల విక్రయాలు జోరందుకున్నాయి. రిలీజ్‌కు ముందే ఈ స్థాయి దూకుడు కనిపించడంతో.. తొలి రోజున ‘ప్యారడైజ్’ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందోనన్న ఆసక్తి నెలకొంది.