పెండింగ్ వేతనాలు చెల్లించాలి

23-09-2026 | 06:07pm

నిర్మల్ సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి ఎదుట మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విలాస్(AITUC State Vice-President Vilas) మాట్లాడుతూ.. ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు ప్రతి నెల 5వ తేదీలోగా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గత ఆగస్టు నెల వేతనాలు ఇప్పటివరకు చెల్లించలేదని, ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించిన రెండు నెలల జీతాలను వెంటనే కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని కోరారు. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులకు కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు