జీతాలు విడుదలయ్యే వరకు సెలవు మంజూరు చేయాలి
మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ మండల(Mallapur Mandal) కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో పనిచేస్తున్న ఈ-పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు(e-Panchayat computer operators) తమకు సెలవు మంజూరు చేయాలని కోరుతూ ఎంపీడీవో శ్రీకాంత్‌కు(MPDO Srikanth) గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత ఐదు నెలలుగా జీతాలు అందకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు లేకపోయినా అప్పులు చేస్తూ కార్యాలయ విధులకు హాజరవుతున్నామని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారిందని పేర్కొన్నారు. జీతాలు విడుదలయ్యే వరకు రేపటి నుంచి తమకు సెలవు మంజూరు చేసి, కార్యస్థానం నుంచి వెళ్లేందుకు అనుమతించాలని ఎంపీడీవోను కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్‌లో ఉన్న జీతాలను విడుదల చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.