నేటి నుంచి పినిట్ వస్త్ర ఎగ్జిబిషన్

19-09-2026 | 05:05am
  1. జూబ్లీహిల్స్ జేఆర్సీ కన్వెషన్స్ సెంటర్‌లో నిర్వహణ
  2. ఈ నెల 21వరకు కొనసాగనున్న ప్రదర్శన

హైదరాబాద్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్, ఫిల్మ్‌నగర్‌లోని జేఆర్సీ కన్వెన్షన్స్ సెంటర్‌(JRC Conventions Centre)లో పినిట్ వస్త్ర  ఎగ్జిబిషన్(Pinit Textile Exhibition) శనివారం ఘనంగా ప్రారం భం కానుంది. ఈ వస్త్ర ప్రదర్శన ఈ నెల 21వరకు కొనసాగుతుందని శుక్రవారం నాడిక్కడ ఓ సమావేశంలో నిర్వాహకులు పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి వరకు ఈ ఎగ్జిబిషన్ ఉంటుందని, ఆకర్షణీయమైన డిజైన్లతో, నాణ్యతతో వస్త్రాలు ఈ ఎగ్జిబిషన్‌లో లభిస్తాయన్నారు. కార్యక్రమంలో పినిట్ వ్యవస్థాపకురాలు సంగీత రాజేష్(Sangeetha Rajesh), నటీమణులు లక్ష్మిమంచు(Lakshmi Manchu), వికితషేరు, జి ఎలక్షన్‌రెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు