బ్రిక్స్‌ దేశాలదే 40 శాతం జీడీపీ: మోడీ

11-09-2026 | 06:32pm

ఢిల్లీ: భారత్‌లో 120కి పైగా యూనికార్న్‌ కంపెనీలు ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) తెలిపారు. ప్రపంచ జీడీపీలో బ్రిక్స్‌ దేశాల వాటా 40 శాతం కాగా, ప్రపంచ వాణిజ్యంలో 25 శాతం వాటా ఉందన్నారు. బ్రిక్స్‌ దేశాలు సగటున 4.5 శాతం జీడీపీ వృద్ధిని సాధిస్తున్నాయని పేర్కొన్నారు.

ఈ వృద్ధి ప్రపంచ సగటును అధిగమించిందన్నారు. నవకల్పన, సహకారం, సుస్థిరాభివృద్ధికి బ్రిక్స్‌ దేశాలు ఆలంబనగా నిలుస్తున్నాయని చెప్పారు. 20 ఏళ్ల క్రితం నాలుగు దేశాలతో ప్రారంభమైన బ్రిక్స్‌ భాగస్వామ్యం ప్రస్తుతం 21 దేశాలకు విస్తరించిందని తెలిపారు. ప్రపంచ జనాభాలో సగం బ్రిక్స్‌ దేశాల్లోనే ఉందని మోదీ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు