నసురుల్లాబాద్లో ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు
అంగన్వాడీ కేంద్రంలో పండ్ల పంపిణీ
నసురుల్లాబాద్,సెప్టెంబర్ 17:(విజయ క్రాంతి): నసురుల్లాబాద్ మండల కేంద్రంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు.మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక అంగన్వాడీ పాఠశాల కేంద్రంలోని చిన్న పిల్లలకు,పండ్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు చందూరి హన్మండ్లు మాట్లాడుతూ.. దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తూ, ప్రపంచ దేశాల ముందు భారతదేశ కీర్తి ప్రతిష్టలను పెంచిన గొప్ప నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని కొనియాడారు. ఆయన ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని,దేశానికి మరిన్ని సేవలందించాలని ఆకాంక్షిస్తూ ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.చిన్న పిల్లలకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో అంగన్వాడీ కేంద్రంలో పండ్లు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ జిల్లా కార్యవర్గ సభ్యులు వడ్ల సతీష్ , గంగాధర్ గుప్తా,మండల ఉపాధ్యక్షులు శేఖర్,బాకా నాగరాజు, గిరిజన మోర్చా మండల అధ్యక్షులు రాందాస్, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు సాయిలు,బండపల్లి శ్రీను, జెల్ల సాయిలు, రవికాంత్, నితిన్ కార్యకర్తలు పాల్గొన్నారు