భీంపూర్ లో ఘనంగా పొలాల అమావాస్య
11-09-2026 | 12:06am
తాంసి/భీంపూర్,(విజయక్రాంతి): తాంసి, భీంపూర్ మండలాలలో గ్రామ గ్రామాన గురువారం అన్నదాతలు ఎడ్లపండగ పొలాల అమావాస్య(Polala Amavasya) సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. ఏడాదంతా రైతు(Farmer) కుటుంబాలకు తోడునీడగా ఉండే బసవన్నలను అలంకరించి, పూజించి, నైవేద్యాలు సమర్పించి ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయించారు. కాగా ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక రైతులలో నిరుత్సాహం కనిపించింది.