వినాయక ఉత్సవాలకు అనుమతి తప్పనిసరి: ఎస్సై ప్రవీణ్ కుమార్

11-09-2026 | 02:59pm

మఠంపల్లి సెప్టెంబర్ 11(విజయ క్రాంతి): మఠంపల్లి మండలంలో వినాయక చవితి ఉత్సవాల నిర్వాహకులు ముందస్తుగా పోలీసుల అనుమతి పొందాలని ఎస్సై ప్రవీణ్ కుమార్(SI Praveen Kumar) సూచించారు.రహదారులపై ప్రజలకు ఇబ్బంది కలగకుండా మండపాలు ఏర్పాటు చేయాలని, విద్యుత్ వినియోగానికి అధికారుల అనుమతి తీసుకోవాలని తెలిపారు. డీజే సౌండ్ సిస్టమ్ కు అనుమతి లేదన్నారు. మండపాల వద్ద గొడవలు జరిగితే కమిటీదే బాధ్యతని, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు