మహిళపై పోలీసుల లైంగికదాడి

25-09-2026 | 05:00am

ఫిర్యాదు చేసినా ఘటనను తొక్కిపెట్టే ప్రయత్నం చేశారని ఆవేదన

సామాజిక, వార్తా మాధ్యమాల్లో వీడియో సంచలనంతో నలుగురు అరెస్ట్

ఉత్తరాఖండ్ ఎమ్మెల్యే ఫాంహౌస్‌లో ఘటన

తీవ్ర విమర్శలపాలవుతున్న పోలీసుల చర్యలు

లక్నో, సెప్టెంబర్ 24: మానప్రాణాలను కాపాడాల్సిన రక్షకులే భక్షకులయ్యారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు పోలీసు(Police)లు ఓ మహిళను చెరబట్టి లైంగికదాడికి పాల్పడ్డారు. ఘటనపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించి ఆ పోలీసులను కాపాడే ప్రయత్నం కూడా చేశారు. కానీ ఆ మహిళ ఆవేదన చెందుతూ పెట్టిన వీడియో కాస్త సోషల్ మీడియా, వార్తా మాధ్యమాల్లో సంచలనం సృష్టించడంతో రంగంలోకి దిగిన అమ్రోహా ఎస్పీ వారిపై కేసు నమోదు చేశారు.

పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని అమ్రోహా జిల్లాలో ఒక ఫౌంహౌస్‌లో 24 ఏళ్ల మ హిళపై సీఆర్పీఎఫ్ ఇన్స్‌పెక్టర్, ఒక పోలీసు హెడ్ కానిస్టేబుల్, యూపీకి చెందిన హెడ్‌కానిస్టేబుల్, సబ్ ఇన్స్‌పెక్టర్‌లు లైంగికదాడికి పాల్పడ్డారు. నిందితులు మహిళకు తెలిసిన వారేనని ఆమెను తీర్థయాత్రలకు తీసు కువెళతామని చెప్పి సెప్టెంబర్ 22న హసన్‌పూర్ ప్రాంతానికి తీసుకువెళ్లారని చెప్పారు. అక్కడ ఆమెపై నలుగురు లైంగికదాడికి పా ల్పడ్డారని తెలిపారు. నిందితులు మోహిత్, లాలారామ్ యాదవ్, సంజయ్ తోమర్, ప్రమోద్‌లుగా గుర్తించామని నలుగురిని అరెస్టు చేశామని అమ్రోహా ఎస్పీ లఖన్ సిం గ్ మీడియాకు వివరించారు.

వీరిపై భారత న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ 70 (1) కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసి జైలుకు పంపామన్నారు. యూపీ సబ్ ఇన్స్‌పెక్టర్ సంజయ్ తోమర్‌ను సస్పెండ్ చేయగా, సీఆర్పీఎఫ్ జవాన్‌పై కఠిన చర్యలకు వారి ప్రధా న కార్యాలయానికి నివేదిక పంపామన్నారు. ఈ ఫాంహౌస్ ఉత్తరాఖండ్‌కు చెందిన ఒక ఎమ్మెల్యేదిగా గుర్తించామని చెప్పారు. ఈ ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ ఇది పోలీస్ వ్యవస్థకే మాయని మచ్చ అని తీవ్రంగా మండిపడ్డారు.

బాధితురాలి ఆవేదన..

ఈ నలుగురు తనపై మంగళవారం రాత్రి లైంగిక దాడికి పాల్పడగానే పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. అయినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. సామాజిక మాధ్యమాల్లో వీడియో ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేయగానే బుధవారం రాత్రి కేసు బుక్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులు పోలీసులు అయితే ఏవైనా ఘటనలను తొక్కిపెట్టేందుకు ప్రయత్నిస్తారా? అని ఆ మహిళ ఆవే దన వ్యక్తం చేసింది. ఈ వీడియోపై సామాజిక మాధ్యమాల్లో పోలీసులపై తీవ్ర విమర్శ లు వస్తుండడంతో అమ్రోహా ఎస్పీ లఖన్ సింగ్ రంగంలోకి దిగి చర్యలు చేపట్టింది.

మరిన్ని వార్తలు