24 గంటల్లో బాలుడి కిడ్నాప్ కేసు చేదించిన పోలీసులు
బోధన్,సెప్టెంబర్ 06 (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మతాశిశు సంరక్షణ ఆసుపత్రి నుంచి బాలుడిని కిడ్నాప్(Boy Kidnapped) చేసిన మహిళ తో పాటు ఓ వ్యక్తి పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.శనివారం ఆసుపత్రి నుంచి పిల్లలకు చాక్లెట్ ఆశచూపి బాలుడిని కిడ్నాప్ చేసింది. దీంతో ఈ విషయంలో జిల్లాలో కలకలం రేపింది. బాల్కొండ మండలంలోని నాగాపూర్ గ్రామానికి చెందిన భార్యభర్తలు ఇద్దరు పిల్లలతో కలిసి చికిత్స నిమిత్తం మతాశిశు ఆసుపత్రి(MataShishu Hospital)కి వచ్చారు. అయితే ఇదే క్రమంలో ఓ మహిళ ఓ వ్యక్తితో కలిసి బాలుడిని కిడ్నాప్ చేసింది.
తల్లిదండ్రులు ఆసుపత్రిలో బాలుడు
కనిపించకపోవడంతో డయల్ 112కు ఫిర్యాదు చేయగా పోలీసులు రంగంలోకి దిగారు. సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా ఓ మహిళ బాలుడిని కిడ్నాప్ తీసుకెళ్తున్నట్లు రికార్డయ్యాయి. సీపీ సాయిచైతన్య 8 బృందాలను ఏర్పాటు చేశారు. ఏసీపీ శ్రీశైలం ఆధ్వర్యంలో మహిళతో పాటు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సిద్దిపేట జిల్లాలోని దౌల్తాబాద్ లో వారిని ప ట్టుకుని బాలుడిని రక్షించారు. బాలుడు ఆచూకీ లభించడంతో తల్లిదండ్రులతో పాటు పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.






