80 వసంతాల వేడుకలను విజయవంతం చేయండి
బోధన్,(విజయక్రాంతి): గత 20 సంవత్సరాలుగా ఉపాధ్యాయుల శ్రేయస్సు, సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తూ, ఉపాధ్యాయులు నేడు పొందుతున్న అనేక సౌకర్యాలను సాధించడంలో స్టేట్ టీచర్స్ యూనియన్ కీలక పాత్ర పోషించిందని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్ అన్నారు. స్థానిక జూనియర్ కళాశాల పాఠశాలలో స్టేట్ టీచర్స్ యూనియన్ 80 వసంతాల వైభవోత్సవానికి సంబంధించిన వాల్ పోస్టర్ను గురువారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ... ఉపాధ్యాయుల హక్కులు, సంక్షేమం కోసం సంఘం నిరంతరం పోరాడుతోందన్నారు. ఉపాధ్యాయులకు ప్రస్తుతం అందుతున్న పీఆర్సీ, డీఏ, పెన్షన్ వంటి సౌకర్యాలను సాధించడంలో స్టేట్ టీచర్స్ యూనియన్ ముందుండిందని తెలిపారు. ఈ నెల 27వ తేదీన హైదరాబాద్ నాగోల్లోని శుభం కన్వెన్షన్లో స్టేట్ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 80 వసంతాల వైభవోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వేడుకలకు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.