అసమానతలను అంతం చేద్దాం... మహిళలకు గౌరవం ఇద్దాం

24-09-2026 | 06:38pm

ఐఎఫ్టియు జాతీయ కార్యదర్శి షేక్షావలి

జవహర్ నగర్,(విజయక్రాంతి): సమాజంలో అసమాన తలను అంతం చేస్తేనే మహిళలకు గౌరవం దక్కుతుందని గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళలపై దారుణాలు జరుగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దారుణమని ఐఎఫ్టియు జాతీయ కార్యదర్శి షేక్షావలి(IFTU National Secretary Shekshavali) ఆందోళన వ్యక్తం చేశారు. సిపిఐ ఎంఎల్ అనుబంధ సంస్థ ప్రగతిశీల మహిళా సంఘం (Progressive Organisation of Women) హైదరాబాద్ మహిళా కార్యకర్తల సమావేశం జవహర్ నగర్ లోని దళిత భవన్ లో గురువారం గడిపే సునీత ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా షేక్షావలి మాట్లాడుతూ మహిళా హక్కులకై పోరాటం చేసే వారిపై ప్రభుత్వం అక్రమంగా కేసులు నమోదు చేసి జైల్లో పెట్టి వేధిస్తున్నారని ప్రజాస్వామిక వాదంతోనే విజయం సాధిస్తామని అన్నారు. మహిళలు చదువుకుంటేనే చైతన్యవంతులు అవుతారని ప్రతి ఒక్కరూ చదువుకొని ఉన్నతంగా ఎదగాలని పేర్కొన్నారు. సమ సమాజ స్థాపనకు మహిళలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన రాంకీ డంపింగ్ యార్డు(Ranki Dumping Yard)ను ప్రభుత్వం శాశ్వతంగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అనంతరం గ్రేటర్ హైదరాబాద్ పిఓడబ్ల్యు కన్వీనర్ గా తుమ్మ రాణి జవహర్ నగర్ కన్వీనర్ గా యమునాగౌడ్లను నూతనంగా నియమించారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు