పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు

17-09-2026 | 02:17pm

బోధన్,సెప్టెంబర్ 17(విజయ క్రాంతి): తెలంగాణ(Telangana) రాష్ట్ర ప్రజాపాలన దినోత్సవా(State Public Administration Day)న్ని పురస్కరించుకుని జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గురువారం వేడుకలు నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.

అనంతరం పోలీస్ లైన్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్వీట్ ప్యాకెట్లు, నోట్‌బుక్స్, పెన్నులను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) ఎన్. శుభం ప్రకాష్, నిజామాబాద్ ఏసీపీ శ్రీ ప్రకాష్, ఏఆర్ ఏసీపీ కృష్ణ, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ రెడ్డితో పాటు సీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది, ఐటీ కోర్, సెంట్రల్ కంప్లైంట్ సెల్, స్పెషల్ బ్రాంచ్, సీసీఆర్‌బీ, సైబర్ క్రైమ్ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు