ప్రజావాణికి 9 ఫిర్యాదులు
21-09-2026 | 08:29pm
తాడ్వాయి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం(Mandal Parishad Office)లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 9 ఫిర్యాదులు వచ్చినట్లు ఎంపీడీవో భరత్ కుమార్ తెలిపారు. ఈ ఫిర్యాదులన్నీ రెవెన్యూ శాఖకు సంబంధించినవే వచ్చినట్లు ఆయన తెలిపారు. ప్రజలు మిగతా శాఖల సమస్యలపై సైతం ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో తహాసిల్దార్ శ్వేత వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.