నర్సాగౌడ్ కుటుంబానికి పరామర్శ

23-09-2026 | 06:35pm

ఖానాపూర్,(విజయక్రాంతి): బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు అమరవేణి నర్సా గౌడ్ కుటుంబాన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం(National BC Welfare Association) అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ బుధవారం పరామర్శించారు. నర్సా గౌడ్ కుమారుడు సిద్ధార్థ బహుజన గౌడ్ ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ కుటుంబాన్ని పరామర్శించి జరిగిన ఘటన పట్ల విచారణ వ్యక్తం చేశారు. ఈయనతో పాటు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు అనుముల భాస్కర్ నాయకులు వివిధ రాజకీయ పార్టీల నేతలు పరామర్శించారు.

మరిన్ని వార్తలు