ఊపిరితిత్తులను కాపాడుకోండి!

25-09-2026 | 05:00am

కిమ్స్ హాస్పిటల్స్ డాక్టర్ శుభకర్ నాదేళ్ల 

హైదరాబాద్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): పొగతాగడం, వాయు కాలుష్యం, దుమ్ము, రసాయనాల ప్రభావం, ఇన్ఫెక్షన్లు, అలర్జీలతో ఊపిరితిత్తుల ఆరోగ్యంపై భారం పెరుగుతోందని కిమ్స్ హాస్పిటల్స్, కొండాపూర్ కన్సల్టెంట్ క్లినికల్ అండ్ ఇంటర్వెన్షన ల్ పల్మోనాలజిస్ట్ డా. శుభకర్ నాదేళ్ల(Dr. Subhakar Nadella) తెలిపారు. సెప్టెంబర్ 25న అంతర్జాతీయ ఊపిరి తిత్తుల దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2026 థీమ్‌గా ‘ఏ లైఫ్ టైమ్ ఆఫ్ లంగ్ హెల్త్’ను ప్రకటించినట్లు తెలిపారు.

పొగతాగడం ఊపిరితిత్తులకు తీవ్ర హాని కలిగిస్తుందని, పక్కవారి పొగను పీల్చడం కూడా ప్రమాదకరమని పేర్కొన్నారు. మూ డు వారాలకు మించి దగ్గు, తరచూ ఆయా సం, పిల్లికూతలు, ఛాతీలో బిగుతు, మెట్లు ఎక్కేటప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బం ది, కఫంలో రక్తం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దన్నారు. పొగతాగడం మానేయడం, కాలుష్యం, దుమ్ముకు దూరంగా ఉండటం, మాస్క్ వినియోగం, వ్యాయామం, అవసరమైన టీకాలు, సకాలంలో వైద్య పరీక్షలతో ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని డా. శుభకర్ నాదేళ్ల సూచించారు.

మరిన్ని వార్తలు