డా. జగదీష్ మృతి పట్ల పువ్వాడ అజయ్ సంతాపం

20-09-2026 | 01:14pm

ఖమ్మం, విజయక్రాంతి: సూర్యాపేట శివారులో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో(Road Accident) మమత ఆసుపత్రి వైద్యుడు, న్యూరో సర్జన్ గా సేవలందిస్తున్న డా. జగదీష్ మృతి చెందడం పట్ల మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్(Former Minister Puvvada Ajay Kumar) సంతాపం వ్యక్తం చేశారు. డా. జగదీష్ మృతి వైద్య రంగానికి, ఆయన కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు తీరని లోటని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని మాజీ పువ్వాడ అజయ్ కుమార్ ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు