ఐలమ్మ వర్ధంతి సభను బహిష్కరించిన రజకులు

10-09-2026 | 03:02pm

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌లో అధికారికంగా నిర్వహించిన చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి(Ilamma death anniversary) సభను రజక సంఘం నాయకులు బహిష్కరించారు. జిల్లా కలెక్టర్ సభకు హాజరుకాకపోవడంపై వారు నిరసన వ్యక్తం చేసి, కలెక్టరేట్ ఎదుట ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రజకులు ఏళ్లుగా వివక్షకు గురవుతున్నారని, అధికారులు సైతం తమను చిన్నచూపు చూడటం సరికాదన్నారు. ప్రతి మూడు నెలలకు కలెక్టర్ అధ్యక్షతన వెల్ఫేర్ కమిటీ(Welfare Committee chaired by the Collector) సమావేశం నిర్వహించాల్సి ఉన్నప్పటికీ, ఇప్పటివరకు కమిటీ ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రాగళ్ల రాజమౌళి, గుండా అవినాష్, కొండయ్య, దాస్, మల్రాజ్ రవీందర్, శంకుతల, వేములవాడ శంకర్, శ్రీకాంత్, పిప్పిరి సాయి, నవీన్, కడతల సాయి, వేములవాడ రమేష్, సోను, సౌమ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు